AP POLYCET Result 2020 | Representational Image (Photo Credits: PTI)

Amaravati, October 9: AP పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) శుక్రవారం AP పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. గత నెల సెప్టెంబర్ 27న ఈ పరీక్ష నిర్వహించారు.

AP PolyCET 2020 అనేది ఆంధ్రప్రదేశ్‌లోని కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన రాష్ట్ర స్థాయి ప్రవేశ పరీక్ష. ఈ పరీక్షను ఏడాదిలో ఒకసారి ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు, పెన్- పేపర్ విధానంలో అభ్యర్థులు 120 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. 41 పరీక్ష కేంద్రాలలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. కొవిడ్ కారణంగా ఈ ఏడాది హాజరుశాతం తగ్గింది.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 120 మార్కులకు గానూ 120 మార్కులతో రాష్ట్రంలో మొదటి స్థానం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన శ్రీ దత్తా సియంసుందర్ 118 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు.

120 మార్కులకు కనీసం 36 మార్కులు సాధించిన వారు ప్రవేశాలకు అర్హులు. అలాగే రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి.  ఈ ఏడాది 84 శాతం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 88,372 మంది దరఖాస్తు చేసుకోగా 71,631 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన 50,706 మంది బాలురులో, 42,313 మంది పరీక్షకు అర్హత సాధించగా 18,467 మంది బాలికలు అర్హత సాధించారు.

AP పాలీసెట్ పరీక్ష 2020 ఫలితాలు ఎలా పొందాలి ?

1. అధికారిక వెబ్‌సైట్ polycetap.nic.in ని సందర్శించండి

2. మీ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి

3. సబ్మిట్ పై క్లిక్ చేయండి

4. మీ AP POLYCET ఫలితాలు తెరపై కనిపిస్తాయి

5. దీన్ని డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

AP POLYCET 2020 ఫలితాలు మరియు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించిన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో AP POLYCET 2020 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభమవుతోంది. కౌన్సెలింగ్ సమయంలో, ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వారు ప్రవేశం పొందాలనుకునే కోర్సును మరియు కళాశాల ఎన్నుకోవలసి ఉంటుంది. ర్యాంక్ మరియు ప్రాధాన్యత ఆధారంగా అడ్మిషన్ లభిస్తుంది.