EXams declared

ఆంధ్రప్రదేశ్‌ టెన్త్‌ ఫలితాలు రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత తక్కువ వ్యవధిలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు.గత ఏడాది 28 రోజుల్లో విడుదల చేయగా, ఈ ఏడాది 18 రోజుల్లో ఫలితాలు ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడా ఏవిధమైన లీకేజీ లేకుండా పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు.

జూన్ 1 నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభం, రాబోయే విద్యా సంవత్సరం 2023-24 అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ఇంటర్ బోర్డు

ఫ‌లితాల కోసం bse.ap.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. సాఫ్ట్ కాపీ డౌన్ లౌడ్ చేసుకోవాల‌నుకుంటే.. ఫ‌లితాలు విడుద‌లైన వారం రోజుల‌కు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపారు. ఏపీ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌ది ప‌రీక్ష‌ల‌కు మొత్తం ఆరు ల‌క్ష‌ల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.ఏప్రిల్ 26న ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదిగో, మే 24 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు

AP SSC ఫలితం 2023ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

దశ 1: bse.ap.gov.in లో అధికారిక BSE వెబ్‌సైట్‌ని సందర్శించండి

దశ 2: హోమ్‌పేజీలో, అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి

దశ 3: రోల్ నంబర్ వంటి మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి.

దశ 4: మీ AP SSC 10వ తరగతి ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.

దశ 5: దానిని డౌన్‌లోడ్ చేసి, తదుపరి ఉపయోగం కోసం ప్రింటవుట్ తీసుకోండి.