Representational Image (File Photo)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాల్లో ప్రవేశం కల్పించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. కొత్త షెడ్యూల్ను విడుదల చేశారు. ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు మే 13 నుంచి మే 19 వరకూ జరగాల్సి ఉంది. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఏపీఈఏపీసెట్‌-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 13న జరగాల్సిన పరీక్షలను 16వ తేదీకి వాయిదా వేశారు.

మే 13వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ మే 13వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో ఆ పరీక్షలను 16వ తేదీకి పోస్ట్‌పోన్‌ చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం మే 16, 17వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు జరగనున్నాయి. మే 18 నుంచి 22 వరకు ఇంజనీరింగ్‌ రాత పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే ఏపీ పీజీసెట్‌ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. జూన్‌ 3వ తేదీకి బదులు 16వ తేదీకి పీజీసెట్‌ పరీక్షను వాయిదా వేశారు. జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష సెషన్ 1 మే 18న, సెషన్ 2 మాత్రం మే 20, 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ఏపీ పీజీ సెట్ ప్రవేశ పరీక్ష జూన్ 3 నుంచి 7వ తేదీ వరకూ జరగాల్సి ఉండగా జూన్ 10, 11, 12, 13, 14 తేదీల్లో జరపనున్నారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డి సీట్ల భర్తీకై నిర్వహించే ఆర్ సెట్ షెడ్యూల్ ఖరారైంది. ఈ పరీక్షలను మే 2 నుంచి మే 5 వరకూ నిర్వహించనున్నారు.

ఇక తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పాలిసెట్ వాయిదా పడింది. మే 17న జరగాల్సిన పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకూ ఆన్‌లైన్ ప్రక్రియలో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.