
Vijayawada, Feb 23: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు (APPSC Group-2 Mains Today) ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష జరగనుంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలో మొత్తం 92,250 మంది మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. వీరందరికీ ఈ రోజు పరీక్ష జరగనుంది. మొదటి సెషన్ లో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, రెండో సెషన్ లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
కాసేపట్లో ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష
ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంటున్న అభ్యర్థులు
ఉ.10 గంటల నుంచి 12.30 వరకు పేపర్-1 ఎగ్జామ్
మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష
15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి రావాలన్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా 175 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు pic.twitter.com/DM3fnsrnrW
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025
నాటకీయ పరిణామాల మధ్య పరీక్షలు
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేసినట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఏపీపీఎస్సీ పేర్కొంది. అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కమిషన్ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఓ వైపు అభ్యర్ధులు పరీక్ష వాయిదా వేయాల్సిందేనంటూ నిరసనలు కొనసాగిస్తుంటే.. మరో వైపు ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్ధుల విన్నపం మేరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసినా.. పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తిచేసిన వారని, వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆదివారం యథావిథిగా పరీక్ష నిర్వహించేందుకే ఏపీపీఎస్సీ మొగ్గుచూపింది. అయితే ఏపీపీఎస్సీ వైఖరి పట్ల కొందరు అభ్యర్థులు మండిపడుతున్నారు.