Hyderabad, January 22: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎస్‌సి పరీక్షలు 2021, మే 17 న ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అయితే మొదటి మరియు రెండవ ఫార్మాటివ్ అసెస్‌మెంట్‌లు వరుసగా మార్చి 15 మరియు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర జారీ చేసిన అకాడెమిక్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 1న పాఠశాలలు తిరిగి తెరవబడతాయి, మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణ , ఆ తర్వాత మే 27 నుండి జూన్ 13 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ప్రతిపాదిత షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపబడింది.
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గణాంకాల ప్రకారం, ఆన్‌లైన్ తరగతులు గత సంవత్సరం సెప్టెంబర్ 1 న ప్రారంభమయిన నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 204 పని దినాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా విద్యాసంవత్సరం కోసం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కనీస హాజరు శాతం అనే నిబంధనను అధికారులు ఎత్తివేశారు.
ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి ఇంటర్ పరీక్షలు మే 3 న ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇంటర్మీడియట్ కోర్సుల ఆఫ్‌లైన్ తరగతులు ఫిబ్రవరి 1న ప్రారంభం కానున్నాయి. ఇంటర్ ఫస్ట్, ఇయర్ కోర్సుల తరగతులు ప్రత్యామ్నాయ రోజులలో జరుగుతాయి. జూనియర్ కళాశాలలతో సహా అన్ని తత్సమాన విద్యాసంస్థలు ఫిబ్రవరి నుండి తిరిగి తెరవబడతాయి.
ఫిబ్రవరి 1 నుండి కనీసం 68 రోజుల పాటు ఆఫ్ లైన్ తరగతులను నిర్వహించడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఆలోచిస్తోంది. ఏప్రిల్ నెల చివరి వరకు ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి చేసి, మే3 పరీక్షలు జరిపేలా షెడ్యూలును సిద్ధం చేస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన సిలబస్‌ను 30 శాతం తగ్గించారు, కేవలం 70 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, తగ్గించిన సిలబస్‌ను అసైన్‌మెంట్‌లు / ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు ఇస్తారు.
ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఒకరోజు తరగతులు నిర్వహిస్తే మరుసటి రోజు రెండో సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ప్రతి తరగతి గదిలో ఒక్కో విద్యార్థికి నడుమ కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా చూడాలని కళాశాలలకు మార్గదర్శకాలు ఇవ్వబడ్డాయి, ఒక్కో బెంచ్‌కు ఒక విద్యార్థి మాత్రమే కూర్చోవాలి, అలాగే ఒక తరగతి గదిలో 30 మందికి మించకూడదు.