Representational Picture. Credits: PTI

Hyderabad, July 15: అఖిల భారత కోటా ఎంబీబీఎస్ (MBBS)), బీడీ ఎస్‌ (BDS) సీట్ల భర్తీకి మెడికల్‌ కౌన్సెలింగ్‌ (Medical Counseling) కమిటీ (ఎంసీసీ-MCC) తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లోని (Dental Colleges) 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు. కాలేజీలు సీట్ల వివరాలను ఈ నెల 20వ తేదీన ఎంసీసీ, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని.. అదే రోజున ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్ల నమోదుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది.

Viral Video: పాముని వెంటాడి వెంటాడి చంపిన కుక్కలు.. తమ బిడ్డలను కాపాడుకోడానికి పాముతో ఫైటింగ్.. వీడియో వైరల్

29వ తేదీన సీట్ల కేటాయింపు

29వ తేదీన సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. ఆగస్ట్‌ నాలుగో తేదీ నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్ట్‌ 7 నుంచి 28వ తేదీ వరకూ రెండో దశ, ఆగస్ట్‌ 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ మూడో దశ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మూడో దశలో మిగిలిన సీట్లకు సెప్టెంబర్‌ 21వ తేదీ నుంచి స్ట్రే వెకెన్సీ రౌండ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని వెల్లడించింది.

Ponguleti in TPCC Committee: పార్టీలో చేరిన నెల రోజులకే పొంగులేటికి కీలక పదవి.. టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామకం