TS 10th Class Exams: తెలంగాణలో జూన్‌ 8వ తేదీ నుంచి పదవతరగతి పరీక్షలు, ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహణ
SSC Exams 2020 | (Photo-PTI)

Hyderabad, May 22: తెలంగాణ రాష్ట్ర న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి జూన్‌ 8వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలను (Telangana SSC Exams Dates) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabita indra reddy) స్పష్టం చేశారు. వాయిదా పడ్డ పది పరీక్షలను జూన్‌ 8వ తేదీ నుంచి.. ప్రతీ పరీక్షకు రెండు రోజుల వ్యవధి ఉండేలా నిర్వహించనున్నారు. వరంగల్‌లో కలకలం రేపుతున్న వలసకూలీల డెత్ మిస్టరీ, బావిలో నుండి 9 అనుమానాస్పద శవాలు వెలికితీత, హత్యా,ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించాలన్న న్యాయస్థానం సూచనలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 2,530 పరీక్షా కేంద్రాలకు అదనంగా మరో 2,005 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు. పది పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల మధ్య నిర్వహించనున్నారు. 'అందుకే చెప్పలేదు' ! కరోనా వ్యక్తి మృతిపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఈటల రాజేంధర్, కరోనా పరీక్షల నిర్వహణపైనా సమాధానం ఇచ్చిన హెల్త్ మినిస్టర్

మార్చి 19న తెలంగాణలో టెన్త్ పరీక్షలు మొదలయ్యాయి. 3 పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక జరగాల్సిన 8 ప్రధాన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

8 ప్రధాన పరీక్షల తాజా షెడ్యూల్‌

జూన్‌ 8న ఇంగ్లీష్‌ మొదటి పేపర్‌

జూన్‌ 11న ఇంగ్లీష్‌ రెండో పేపర్‌

జూన్‌ 14న గణితము మొదటి పేపర్‌

జూన్‌ 17న గణితము రెండో పేపర్‌

జూన్‌ 20న సైన్స్‌(భౌతిక శాస్త్రం) మొదటి పేపర్‌

జూన్‌ 23న సైన్స్‌(జీవశాస్త్రం) రెండో పేపర్‌

జూన్‌ 26న సోషల్‌ స్టడీస్‌ మొదటి పేపర్‌

జూన్‌ 29న సోషల్‌ స్టడీస్‌ రెండో పేపర్‌

జులై 2న ఓరియంటల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ మొదటి పేపర్‌(సంస్కృతం మరియు అరబిక్‌)

జులై 5న ఒకేషనల్‌ కోర్సు(థియరీ)