తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు. జూలై 13న ఈసెట్ జరగనుండగా, జులై 14 నుంచి ఎంసెట్ (TS EAMCET 2022) షురూ కానుంది. జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు జరపనున్నారు. జూలై 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఖరారైన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పీకేపై కేసీఆర్ ప్రశంసలు, జాతీయ రాజకీయాల్లోకి అప్పుడే ఎంట్రీ ఇస్తానన్న సీఎం, 95 నుంచి 105 స్థానాలతో రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి
కాగా, ఎంసెట్ పరీక్షలు 28 ప్రాంతీయ సెంటర్లలో 105 కేంద్రాల్లో జరపనున్నారు. అందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈసారి ఎంసెట్ పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లోపే ర్యాంకులు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజి ఎంసెట్ కు ఉండదన్న సంగతి తెలిసిందే.