Representational Image (Photo Credits: PTI)

Hyderabad, August 25: తెలంగాణలో సెప్టెంబ‌ర్ ఒక‌టి నుంచి ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గతులు (Online classes) ప్రారంభం అవుతాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వెల్ల‌డించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థుల‌కు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ బోధ‌న ప్రారంభం అవుతుంద‌ని ఆమె స్పష్టం చేశారు. అలాగే పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా డిజిట‌ల్ బోధ‌న ఉంటుంద‌ని తెలిపారు. దీని కోసం అధ్యాప‌కులు, ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ పూర్తి చేశామ‌ని తెలిపారు. కాగా అధ్యాప‌కులు ఈ నెల‌ 27 నుంచే కళాశాలల‌కు వెళ్ళాల‌ని విద్యా శాఖ మంత్రి (TS Educatuonal Minister) ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబర్ 5న‌ రాధాకృష్ణ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా వుండ‌గా వ‌చ్చే నెల 1 నుంచి పాఠ‌శాల విద్యార్థుల‌కు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్‌ 1 నుంచి (September 1 for academic year 2020-21) ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆలోపు వీటికి సంబంధిం చిన ఆన్‌లైన్‌ క్లాస్‌ మెటీరియల్, వీడియో పాఠాలు వంటివి తయారు చేయాల్సిందిగా ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులను ఆదేశించింది. దీని కోసం ఈనెల 27 నుంచి పాఠశాల సిబ్బంది విధులకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈమేరకు సోమవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ (Chitra Ramchandran) ఉత్తర్వులు జారీ చేశారు.  ఏపీలో సెట్స్‌ నిర్వహణ తేదీలు ఖరారు, సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్‌ ఎంసెట్‌, అన్ని పరీక్షల తేదీల వివరాలు లోపల కథనంలో..

కాగా కోవిడ్‌ అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా పలు రంగాలకు మినహాయింపులు ఇచ్చినప్పటికీ విద్యా సంస్థలకు మాత్రం ప్రభుత్వం (Telangana government) నో చెబుతూ వచ్చింది. అయితే, విద్యా సంవత్సరం ఇబ్బందుల్లో పడకుండా ఆన్‌లైన్‌ పద్ధతిలో పాఠ్యాంశ బోధనకు అనుమతి ఇచ్చింది. ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ లేదా టీవీ/టీశాట్‌ ద్వారా బోధించేందుకు విద్యాశాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. 27వ తేదీ నుంచి పాఠశాలకు హాజరయ్యే టీచర్లు సబ్జెక్టుల వారీగా వీడియో పాఠాలను రూపొందించాలి. వీటిని విద్యార్థులు వీక్షించేందుకు వీలుగా ఎలా అప్‌లోడ్‌ చేయాలనే దానిపై మాత్రం విద్యాశాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

తెలంగాణ రాష్ట్రంలో 28 వేలకు పైగా ప్రభుత్వ విద్యా సంస్థలున్నాయి. వీటిలో 30 లక్షల మందికిపైగా విద్యార్థులున్నారు. ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తే ఎంతమందికి వెసులుబాటు ఉంటుందనే దానిపై ఇటీవల విద్యాశాఖ పరిశీలన చేసింది. దీనిపై ఇంకా ఎటువంటి సమాచారం బయటకు లేదు. పదవ తరగతి విద్యార్థుల మార్కులు వచ్చేశాయి, www.bse.telangana.gov.inలోకి వెళ్లి గ్రేడింగ్‌ వివరాలు పొందవచ్చు

రాష్ట్రంలో ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ నిర్వహిస్తున్న దూరవిద్యా ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్‌ విద్యా ర్థులంతా పాస్‌ అయ్యారు. అందరికీ ప్రతి సబ్జెక్టులో 35 శాతం కనీస పాస్‌ మార్కు లను ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి చిత్రారామచంద్రన్‌ శుక్రవారం జీవో 12ను జారీ చేశారు. కరోనా కారణంగా గత ఏప్రిల్‌/మే నెలల్లో నిర్వహించాల్సిన ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లోనూ పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎలా ముందుకు సాగాలన్న విషయంలో విద్యాశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆ కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయిం తీసుకుంది. పరీక్షలు రాసేందుకు అర్హత కలిగిన విద్యార్థులందరికీ కనీస పాస్‌ మార్కులను ఇస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 75 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. అందులో ఎస్సెస్సీ విద్యార్థులు 43 వేల మంది, ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 32 వేల మంది ఉన్నట్లు తెలిపారు.