Telangana Schools Reopening: రేపటి నుంచి తెలంగాణలో 6, 7, 8 తరగతులు ప్రారంభం, మార్చి 1లోపు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని తెలిపిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్రంలో ఇంకా నియంత్రణలోకి రాని కరోనా
File image of Minister Sabitha Indra Reddy | File Photo.

Hyderabad, Feb 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (State Education Minister Sabita Indrareddy) తెలిపారు. అయితే రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ఎప్పుడైనా తరగతులను ప్రారంభించుకోవచ్చని (classes 6 to 8 start from Tommorrow) ఆమె మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన విద్యాశాఖ మంత్రి కోవిడ్ మార్గదర్శక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రుల అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.

కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చి చివరి నుంచి విద్యాలయాలు మూతపడ్డాయి. సుదీర్ఘకాలం తర్వాత కాలేజీలు ప్రారంభమైనప్పటికీ (Telangana Schools Reopening) పాఠశాలలు మాత్రం తెరుచుకోలేదు. ఇక తెలంగాణలో ఇప్పటికే 9, 10 వ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మిగతా తరగతులు చదువుకునే విద్యార్థులకు కూడా బడులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తాజా 6, 7, 8 తరగతులను ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెండు స్థానాలకు వందల సంఖ్యలో అభ్యర్థుల పోటీ, తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు, మార్చి14న పోలింగ్, మార్చి17న ఓట్ల లెక్కింపు ప్రక్రియ

పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌, గ్రాడ్యుయేషన్‌, పీజీ కోర్సుల్లోని విద్యార్థులందరికీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం విధితమే. అన్ని సంవత్సరాల విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు మొదలయ్యాయి.

మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,97,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,94,386 మంది కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1625 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 1701 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 84.7 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.