IPE Exams 2020. Representational Image. | Photo: PTI

Hyderabad, July 9: కరోనావైరస్ కారణంగా విద్యా వ్యవస్థ ఇప్పుడు అయోమయంలో పడింది. విద్యార్ధుల భవిష్యత్తు ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. విద్యార్ధులకు పరీక్షల విషయంలో ప్రభుత్వాలు ఇప్పుడు క్రమంగా ఓ క్లారిటీ ఇస్తూ వస్తున్నాయి. విద్యార్ధులకు కాస్త ఈ నిర్ణయాలు ఉపశమనం కల్పిస్తూనే ఉన్నాయి. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేయడం కుదరదు, తప్పనిసరిగా పరీక్షల నిర్వహించాల్సిందే, స్పష్టం చేసిన యూజీసీ సెక్రటరీ రజనీష్ జైన్

తాజాగా తెలంగాణా ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు (Inter Supplementary Exams Cancelled)చేస్తూ తెలంగాణా ఇంటర్ బోర్డ్ (TS Inter Board) నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరిని పాస్‌ చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో 1.47 లక్షల విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుందని ఆమె చెప్పారు. తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా, హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం, ఎంట్రెన్స్‌ టెస్టులను రద్దు చేయాలని హైకోర్టులో పిల్‌ వేసిన స్టూడెంట్‌ యూనియన్‌ నేతలు

దీనిపై విద్యార్ధులు వారి తల్లి తండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణా సర్కార్ పది పరీక్షలను రద్దు చేసింది. ఏపీ కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ విషయంలో ఏపీ ముందే నిర్ణయం తీసుకుంది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలంగాణా సర్కార్ ప్రకటించింది.