Hyderabad, June 30: కరోనావైరస్ కారణంగా తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా (All Entrance Exams Postponed in TS) పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం (Telangana government) నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. టీఆర్ఎస్ పార్టీలో కరోనా కలకలం, తాజాగా తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్, సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్‌లో పద్మారావు గౌడ్
లాక్‌డౌన్ స్పష్టత ఇచ్చాకే పిటిషన్‌పై విచారణ జరపాల్సి ఉంటుందని తెలిపింది. అయితే లాక్‌డౌన్ నిర్ణయంపై ఆధారపడి ఉందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రభత్వుం కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో జరగాల్సిన ఎంసెట్, పాలిసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడినట్టయింది. తెలంగాణలో మరో 975 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో 15 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 250 దాటిన కరోనా మరణాలు
రేపటి నుంచి ఈ నెల 15 వరకూ కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను ఖరారు చేసింది కాగా.. ప్రభుత్వ నిర్ణయంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో ఆడుకోవద్దని కోరుతూ పిటిషనర్ కోరారు. దీనిపై నేడు కోర్టులో వాదనలు జరగాల్సి ఉంది. ఎన్ఎస్‌యూఐ తరపున సీనియర్ న్యాయవాది చల్లా దామోదర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. ఇంతలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
జులై 1న పాలిసెట్‌తో పాటు పీజీ ఈసెట్ పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. జులై 4న ఈసెట్, జులై 6 నుంచి 9 వరకు ఎంసెట్, 10 న లాసెట్, 13న ఐసెట్, 15న ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష జరగాల్సి ఉంది. ఇవి వాయిదా పడ్డాయి.