TS SSC Result 2022: కాసేపట్లో తెలంగాణ పదో‌ త‌ర‌గతి ఫలి‌తాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Representational Picture. Credits: PTI

పదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు నేడు విడు‌దల కాను‌న్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, లోచూడ‌వచ్చు. పది పరీక్షలను ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు. 167 మంది ప్రైవేట్‌ విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్షలకు హాజ‌ర‌య్యారు.

తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి క్యాలెండర్‌ విడుదల, ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలలు పనిదినాలు, పండుగ‌ల సెల‌వులను ఓసారి చెక్ చేసుకోండి

ఇక తెలంగాణ‌లో ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఆగ‌స్టు 1 నుంచి 10వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం ఉద‌యం 9 గంట‌ల నుంచి మధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే విధంగా మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల నుంచి సాయంత్రం 5.30 గంట‌ల వ‌రకు సెకండ్ ఇయ‌ర్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి.