Hyderabad, Apr 24: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) కాసేపటి క్రితం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను అధికారులు ఒకేసారి విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్, Manabadi, tsbie.cgg.gov.in లో ఫలితాలను చూసుకోవచ్చు. వెబ్ సైట్ లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు.
దాదాపు పది లక్షల మంది
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.