Newdelhi, May 27: ప్రపంచాన్ని భయం గుప్పిట్లోకి నెట్టిన కరోనా మహమ్మారి (Corona Virus) ఇంకా వేధిస్తూనే ఉంది. ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ తర్వాత కరోనా బాధితుల్లో ప్రతి పదిమందిలో ఒకరు లాంగ్ కొవిడ్ (Long Covid) లక్షణాలతో (Symptoms) బాధపడుతున్నట్టు అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. కరోనా నుంచి బయటపడిన ప్రతి పది మందిలో ఒకరు ఇప్పటికీ ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం పేర్కొంది. లాంగ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారిలో 12 కీలక లక్షణాలు ఉన్నట్టు వెల్లడించారు.
12 key symptoms of #LongCovid identified by study https://t.co/3N6MkB8zGF
— Zee News English (@ZeeNewsEnglish) May 26, 2023
లక్షణాలు ఇవే
చిన్నపాటి పనికే అలసిపోవడం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, మెదడు సమస్యలు, శృంగారంపై అనాసక్తి, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, చాతీలో నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి లాంగ్ కొవిడ్ లక్షణాలేనని అధ్యయనం వివరించింది.