Indian Railways: రైల్వేశాఖ మరో తీపి కబురు, విజయవాడ నుంచి కొత్తగా 12 స్పెషల్ ట్రైన్స్, ఇప్పటికే 110 రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం, ఏప్రిల్‌ 1 నుంచి కొత్తగా 12 రైళ్లు ప్రారంభమవుతాయని తెలిపిన రైల్వే శాఖ
File image of passengers waiting for trains (Photo Credit: PTI)

Vijayawada, Mar 13: ఏపీ నుంచి రైలు ప్రయాణం చేసే వారికి శుభవార్త, కరోనా కారణంగా రద్దయిన పలు రైళ్లు మళ్లీ పట్టాలెక్కుతున్నాయి. తాజాగా ఏపీ లో విజయవాడ నుంచి మరో 12 రైళ్లను (12 new Special passenger trains) పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే విజయవాడ (vijayawada) మీదుగా రోజూ 110 రైళ్లు తిరుగుతున్నాయి.

ఏప్రిల్‌ 1 నుంచి మరో 12 రైళ్లను పునరుద్ధ రించనున్నారు. విజయవాడ–సాయినగర్‌ షిర్డి– విజయవాడ (07207/07208) మధ్య రెండు రైళ్లు, అలాగే విజయవాడ–సికింద్రాబాద్‌–విజయవాడ (02799/02800), విశాఖపట్నం–సికింద్రాబాద్‌–విశాఖపట్నం (02739/02740), గుంటూరు –విశాఖపట్నం–గుంటూరు (07239/0740), గూడూరు –విజయవాడ–గూడూరు (02734/02644), నర్సాపూర్‌–ధర్మవరం–నర్సాపూర్‌ (07247/ 07248) మార్గాల్లో రెండేసి రైళ్ల చొప్పున ఏప్రిల్‌ 1 నుంచి పునరుద్ధరిస్తున్నారు.

షిర్డి, సికింద్రాబాద్, విశాఖపట్నం, ధర్మవరం, గూడూరులకు విజయవాడ మీదగా రైళ్లు రానున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగానే నడుపుతున్నారు. ఈ రైళ్లలో టికెట్లను ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని.. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

బ్యాంకు ఖాతాదారులు అలర్ట్ అవ్వండి, వచ్చే వారం 5 రోజులు బ్యాంకులకు సెలవులు, రెండు రొజుల పాటు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన తొమ్మిది ప్రధాన బ్యాంక్ ఉద్యోగుల సంఘాలు

గతంలో 250 రైళ్లు విజయవాడ జంక్షన్‌ మీదగా ప్రతి రోజూ నడిచేవి. ప్రస్తుతం నడుస్తున్న 110 రైళ్లకు అడ్వాన్సు బుకింగ్‌ ఇస్తున్నారు. ఈ బుకింగ్‌లు నెల రోజులు ముందుగానే అయిపోతున్నాయి. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరిస్తున్నారే కానీ ప్యాసింజర్‌ రైళ్లను మాత్రం పునరుద్ధరించలేదు. రెగ్యులర్‌ రైళ్లు ఎప్పుడు వస్తాయా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు.