Newdelhi, June 2: భానుడి భగభగలతో దేశమంతా మండిపోతున్నది. అన్ని రాష్ర్టాల్లో ఉష్ణోగ్రతలు (Temperatures) ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే, ఇటీవల ఢిల్లీ (Delhi), నాగ్ పూర్ (Nagpur) లో మాత్రం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే 29న ఢిల్లీలోని మంగేశ్ పూర్ లో ఏకంగా 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇది దేశచరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా అంతా భావించారు. అయితే, మరునాడే ఈ రికార్డును బ్రేక్ చేస్తూ గురువారం నాగ్ పూర్ లోని అంబాజరీ రోడ్డులో 56 డిగ్రీలు, సోనేగావ్ లో 54 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇలా అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడాన్ని వాతావరణ విభాగం సైతం అనుమానించి విచారణ జరిపింది. సెన్సార్ లలో లోపాల వల్లనే ఇలా అధిక ఉష్ణోగ్రతలు రికార్డయినట్టు గుర్తించింది. సెన్సార్ లోపం వల్ల 3 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డయినట్టు అధికారులు వెల్లడించారు.
ఏపీలో లోక్ సభ స్థానాల ఎగ్జిట్ పోల్స్ పూర్తి వివరాలు ఇవిగో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..