AP Job Calendar: ఏపీలో భారీగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, త్వరలో 1,200కు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ, కసరత్తు చేస్తోన్న ఏపీ సర్కారు, ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో నోటిఫికేషన్లు జారీచేస్తామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు
AP Government logo (Photo-Wikimedia Commons)

Amaravati, July 18: ఏపీలో త్వరలో కొలువుల జాతర రానుంది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై సీఎం జగన్ ప్రభుత్వం (CM Jagna Govt) కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

గ్రూప్‌–1, గ్రూప్‌–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి (More than 1,200 posts ) ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్‌.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్‌ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్‌–1, గ్రూప్‌–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు.

ఏపీలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు,135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు, పోస్టుల వివరాలను ప్రకటించిన మంత్రులు మేకతోటి సుచరిత, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు.