Premature Rains in AP: మండు వేసవిలో ఏపీని ముంచెత్తనున్న అకాల వర్షాలు, ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపిన వాతావరణ శాఖ, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం
Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Amaravati, April 12: ఆంధ్ర ప్రదేశ్ లో క్రమంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మండు వేసవిలోనూ అకాల వర్షాలు పడే అవకాశాలు (Andhra Pradesh weather update) కనిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. ఎండలు పెరిగి అకాల వర్షాలు (Premature Rains in AP) పడే అవకాశాలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. ఇవన్నీ.. నైరుతి రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మధ్య బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది.

దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఈ తేమ గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపథ్యంలో.. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు (Premature Rains) పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (India Weather Forecast) అధికారులు పేర్కొన్నారు. 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై క్రమంగా మిగిలిన జిల్లాలకు విస్తరిస్తాయని, అదేవిధంగా.. కోస్తాంధ్రలోనూ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.ఈ నెల 22 వరకు వర్షాలు పడే సూచనలున్నాయని, దీని వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని వెల్లడించారు.

సచివాలయంలో కరోనా కల్లోలం, ఏపీలో కొత్తగా 3,495 కరోనా కేసులు, 9 మంది మృతితో 7300 కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య, ప్రస్తుతం 20,954 యాక్టివ్‌ కేసులు

ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో నేడు, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో కురుపాంలో 3.1 సెం.మీ., గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.