Amaravati, April 11: ఏపీలో గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా (Coronavirus) నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,25,401మందికి కరోనా వైరస్ (AP Covid) సోకింది. గడచిన 24 గంటల్లో 1,198 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,97,147 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 9 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7300 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,54,29,391 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
ఒక్క చిత్తూరు జిల్లాలోనే 719 కొత్త కేసులు నమోదు కాగా, నలుగురు మృతి చెందారు. ఇతర జిల్లాల విషయానికొస్తే గుంటూరు జిల్లాలో 501, విశాఖ జిల్లాలో 405, కృష్ణా జిల్లాలో 306 కేసులు గుర్తించారు. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 40 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 9,25,401 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,97,147 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 20,954 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్ అమరావతి సచివాలయాన్ని తాకింది. పలువురు సచివాలయ ఉద్యోగులు కొవిడ్ బారిన పడటం కలకలం రేపుతోంది. గతేడాది అమరావతి సచివాలయ ఉద్యోగుల్లో దాదాపు 200 మందికి పైగా కోవిడ్ బారిన పడ్డారు. కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా, మిగిలిన వారు కోలుకున్నారు. అయితే, ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌లో గత 15 రోజుల్లో పలువురు ఉద్యోగులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.
కరోనా లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేయించుకుని, పాజిటివ్ నిర్ధారణ అయిన వారు సెలవులు పెట్టుకుని సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. సచివాలయంలోని మున్సిపల్, పరిశ్రమలు, మైనింగ్‌శాఖల్లో తొమ్మిది మంది ఉద్యోగులు కరోనా బారినపడినట్లు తెలిసింది. వీరిలో.. పరిశ్రమలశాఖలోని అసిస్టెంట్ సెక్రటరీ, మైనింగ్‌శాఖలో ఎస్‌వో, ఏఎ్‌సవో, పురపాలకశాఖ జాయింట్ సెక్రటరీ, అదేశాఖలోని ఇద్దరు ఎస్‌వోలు, ఇద్దర ఏఎ్‌సవోలు, ఒక డీఈవో కరోనా బారినపడినట్లు తెలిసింది.