school-teachers (Photo-X)

ఆంధ్రప్రదేశ్‌లోని 6100 ఖాళీల కోసం AP DSC 2024 నోటిఫికేషన్ పాఠశాల విద్యా శాఖ 26 జనవరి 2024న విడుదల చేసింది. విద్యా మంత్రి బొత్సా సత్యానారాయణ అధికారిక AP DSC 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. AP DSC నోటిఫికేషన్ 2024 https://apdsc.apcfss.inలో AP DSC వివరణాత్మక నోటిఫికేషన్ 2024 Pdf ద్వారా సమాచార బులెటిన్‌తో పాటు APTRT జిల్లాల వారీ ఖాళీల జాబితాల కోసం ప్రకటించింది.

AP ప్రభుత్వం టీచర్స్ రిక్రూట్‌మెంట్ 2024 ప్రక్రియను 12 ఫిబ్రవరి 2024 నుండి ప్రారంభిస్తోంది. మొత్తం 6,100 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 2,280 ఉండగా.. స్కూల్‌ అసిస్టెంట్‌ 2,299; టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్‌ 42 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేయనున్నారు. AP DSC 2024 పరీక్షతో పాటు AP TET 2024 పరీక్షకూ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టెట్‌కు ఫిబ్రవరి 8 నుంచి, డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏపీలో 6,100 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల, ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం, ఏప్రిల్‌ 7వ తేదీన ఫలితాలు

ఏపీ డీఎస్సీ పూర్తి షెడ్యూల్

ఏపీ డీఎస్సీకి ఫిబ్రవరి 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మాక్‌ టెస్ట్‌ను ఫిబ్రవరి 24న అందుబాటులోకి వస్తుంది. మార్చి 5 నుంచి హాల్‌టికెట్లు ప్రకటిస్తారు. డీఎస్సీ పరీక్షలు మార్చి 15 నుంచి 30 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. సెషన్‌ 1 ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; సెషన్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. డీఎస్సీ ప్రాథమిక కీని మార్చి 31న విడుదల చేసి ఏప్రిల్‌ 1వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 2న తుది కీ విడుదల చేసి ఫలితాలను ఏప్రిల్‌ 7న ప్రకటిస్తారు.

ఏపీ టెట్‌ షెడ్యూల్‌

ఏపీ టెట్‌ పరక్షకు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ 19న అందుబాటులోకి వస్తుంది. టెట్‌ హాల్‌ టికెట్లు ఫిబ్రవరి 23నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. పరీక్షను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ప్రాథమిక కీని మార్చి 10న విడుదల చేస్తారు. ఈ కీపై మార్చి 11వరకు అభ్యంతరాలు స్వీకరించి 13న తుదికీ విడుదల చేస్తారు. మార్చి 14న టెట్‌ ఫలితాలు ప్రకటిస్తారు.