Vijayawada, Jan 1: సంక్రాంతికి (Sankranti) సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై (Charges) 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు (Tickets) బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ (Discount) పొందొచ్చని వెల్లడించింది.
పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు 6,400 స్పెషల్ బస్సులను తిప్పుతామని వివరించారు. ఈ స్పెషల్ బస్సులలో కూడా సాధారణ బస్సుల ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అదనంగా రాయితీని అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే వృద్ధులకు టికెట్ ధరపై 25 శాతం రాయితీ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. కుటుంబం సహా సొంతూరుకు వెళ్లే వారు తాజాగా ప్రకటించిన రాయితీతో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని చెప్పారు. కాగా, ఈ-వాలెట్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్ లకూ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ