Bank Holidays Alert: రాబోయే 5 రోజులు పలు రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్, తెలుగు రాష్ట్రాల్లో యథావిధిగా పనిచేయనున్న బ్యాంకులు, వచ్చే 5 రోజులు ఏయే రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయో ఓ సారి తెలుసుకోండి
Representational Image | (Photo-ANI)

New Delhi, July 18: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్ న్యూస్.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రాబోయే ఐదురోజుల పాటు బ్యాంకులు (Bank Holidays Alert) మూసివేస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు శనివారం వెల్లడించింది. రిజర్వు బ్యాంకు ( Reserve Bank of India) క్యాలెండరు నోటిఫికేషన్ ప్రకారం జులై 21వతేదీన బ్యాంకులన్ని (Banks will be closed in these cities for the next 5 days) మూసి ఉంచుతారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని నగరమైన డెహ్రాడూన్ లో హరేలా పూజ సందర్భంగా బ్యాంకులను మూసివేశారు. యు టిరోట్ సింగ్ డే ,ఖార్చి పూజల సందర్భంగా త్రిపుర రాష్ట్రంలోని అగర్తలా, మేఘాలయలోని షిల్లాంగ్ నగరాల్లో బ్యాంకులు మూసివేశారు.వారాంతమైన ఆదివారం (జులై18) బ్యాంకులు పనిచేయవు.

సిక్కిం రాజధాని నగరమైన గ్యాంగ్ టక్ లో సోమవారం (జూలై 19) గురు రింపోచే సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మంగళవారం (జూలై 20) బక్రీద్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, తిరువనంతపురం నగరాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించింది రిజర్వ్‌ బ్యాంక్‌. ఈదుల్ అదా పండుగ సందర్భంగా భారతదేశంలోని అన్ని నగరాల్లో బ్యాంకులు మూసి ఉంచనున్నట్లు వెల్లడించింది. అయితే ఐజాల్, కొచ్చి, తిరువనంతపురం, భువనేశ్వర్, గ్యాంగ్ టక్ లలో మాత్రం జూలై 21 న బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది.

కరోనా మాటున పొంచి ఉన్న టీబీ ముప్పు, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని తెలిపిన ఆరోగ్యశాఖ, దేశంలో తాజాగా 41,157 మందికి కోవిడ్, 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్‌

బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే

1. యు టిరోట్ సింగ్ డే లేదా ఖార్చి పూజ సందర్భంగా త్రిపురలోని అగర్తాలాలో శనివారం (జూలై 17), మేఘాలయలోని షిల్లాంగ్ బ్యాంకులు మూసివేయబడతాయి.

2. వారాంతంలో ఆదివారం (జూలై 18) బ్యాంకులు మూసివేయబడతాయి.

3. సోమవారం (జూలై 19), గురు రింపోచే యొక్క తుంగ్కర్ త్చేచు సందర్భంగా సిక్కిం రాజధాని గ్యాంగ్‌టోక్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి.

4. మంగళవారం (జూలై 20) బక్రిద్ సందర్భంగా జమ్మూ, శ్రీనగర్, కొచ్చి, తిరువనంతపురాలలో బ్యాంకులు మూసివేయబడతాయి.

5. ఈద్-అల్-అధా సందర్భంగా బుధవారం (జూలై 21) భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే, ఐజాల్, కొచ్చి, భువనేశ్వర్, తిరువనంతపురం, మరియు గ్యాంగ్‌టాక్‌లో బ్యాంకులు తెరిచి ఉంటాయి.