Representational Image (Credits: Google)

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఇప్పటికే డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఉన్నత విద్యామండలి ఆదేశాల ప్రకారం చూస్తే.. శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో మొదటి విడుత ఈ నెల 16 నుంచి జూన్‌ 10 వరకు దోస్త్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశమున్నది.

మే 20 నుంచి జూన్‌ 11 వరకు వెబ్‌ ఆప్షన్స్‌కు చాన్స్‌ ఉండగా, జూన్‌ 16న మొదటి విడుత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటుంది. తిరిగి జూన్‌ 16 నుంచి జూన్‌ 26 వరకు రెండో విడుత ఆప్షన్ల ప్రక్రియ, 30న రెండో విడుత సీట్ల కేటాయింపు, జూలై 1 నుంచి జూలై 6 వరకు మూడో విడుత వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ, 10న మూడో విడుత సీట్ల కేటాయింపు ఉండనున్నది. జూలై 17 నుంచి మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడుతలుగా అవకాశమిచ్చి సీట్లను భర్తీ చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశమిచ్చింది.

జూన్ 14 నుంచి టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు, పదోతరగతి ఫలితాల్లో మళ్లీ బాలికలదే పై చేయి, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఫెయిలైన విద్యార్థులకు మంత్రి మనవి

నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల వివరాలను సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించనున్నారు. విశ్వవిద్యాలయ అధికారులు ఇప్పటికే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. గతేడాది విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కళాశాలలు, అందులో నిండిన సీట్లు, ప్రస్తుతం ఏ కళాశాల ఏ కోర్సులో ఎన్ని సీట్లు కావాలని కోరుకుంటుందన్న వివరాలను సేకరించారు. పూర్తి వివరాలు పరిశీలించిన తర్వాత అనుమతి ఉన్న కాలేజీలు, సదరు కాలేజీలకు కేటాయించిన సీట్ల వివరాలు ఈ రోజు వెల్లడించనున్నారు.

2793 స్కూళ్లలో వందశాతం ఉతీర్ణత, 25 స్కూళ్లలో జీరోశాతం ఉతీర్ణత నమోదు, తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు వివరాలు ఇవిగో..

దోస్త్‌ ద్వారా సులువుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అందుకోసం విద్యార్థులు ముందుగానే తమ ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింక్‌ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. టీ-యాప్‌ ద్వారా https://dost.cgg.gov.in విద్యార్థులు లాగిన్‌ కాగానే వారికి దోస్త్‌ ఐడీ, పిన్‌ నంబరు వస్తుంది. వీటిని ఉపయోగించి దరఖాస్తు పూర్తి చేసుకోవా లి. అందులో కోర్సులు, కాలేజీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలి. కోరుకున్న కళాశాలలో సీటు వస్తే సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా కన్ఫర్మేషన్‌ చేసుకోవాలి. ఏ దశ కౌన్సెలింగ్‌లో అయినా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా ఎంపిక చేసుకున్న కళాశాలకు వెళ్లి ధ్రువపత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.