Hyderabad, Oct 10: బంగారం ధరలకు (Gold Price) మళ్లీ రెక్కలొచ్చాయి. ఆరు నెలల కనిష్ఠ స్థాయికి మొన్నటివరకూ పడిపోయిన పసిడి ధర కేవలం 24 గంటల వ్యవధిలోనే ఊహించనంతగా పెరిగింది. ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య కొనసాగుతున్న యుద్ధమే దీనికి కారణం. నిన్న ప్రారంభ ట్రేడింగ్ (Trading) లోనే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ. 440 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. నిన్నటి మార్కెట్ (Market) తో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధర మరో రూ. 220 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,200గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,350 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలకు కూడా పెరిగాయి. ఈరోజు కిలో వెండి ధర రూ. 72,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ధర రూ. 500 పెరిగింది.
Gold prices surge by Rs 220 to reach Rs 58,200, while silver sees a significant jump of Rs 500, reaching Rs 72,600. The current rate for 22-carat gold is Rs 53,350. 📈🌟
— D.D.DAHIKAR (@DahikarDilesh) October 10, 2023
ఇతర నగరాల్లో బంగారం ధరలు:
- విజయవాడ: 24 క్యారెట్లు - రూ. 58,200.. 22 క్యారెట్లు - 53,350
- విశాఖపట్నం: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
- బెంగళూరు: 24 క్యారెట్లు - 58,200.. 22 క్యారెట్లు - రూ. 53,350
- చెన్నై: 24 క్యారెట్లు - 58,530.. 22 క్యారెట్లు - రూ. 53,650
- ఢిల్లీ: 24 క్యారెట్లు - 58,350.. 22 క్యారెట్లు - రూ. 53,500.