Hyderabad, June 11: తెలంగాణలో (Telangana) నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో నేడు రాష్ట్రమంతటా భారీ వానలు (Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలోని 13 జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షపాతం నమోదు కానున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక.. నేడు 13 జిల్లాల్లో భారీ వర్షాలుhttps://t.co/yPcBayB0DL
— Samayam Telugu (@SamayamTelugu) June 11, 2024
నగరానికీ భారీ వర్ష సూచన
హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు పేర్కొన్న అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. మరోవైపు ఆఫీసులకు వెళ్లేవాళ్లు వాతావరణ పరిస్థితుల్ని బట్టి నడుచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.