Hyderabad, Apr 25: హైదరాబాద్ (Hyderabad) ఉప్పల్ స్టేడియంలో (Uppal Stadium) నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్టేడియం పరిసరాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకూ చెంగిచర్ల, బోడుప్పల్, ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపునకు వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ భగాయత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు మళ్లిస్తారు.
Road Accident in Kodada: కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు మృతి
ఎల్బీనగర్, నాగోల్ మీదుగా ఉప్పల్ కు వచ్చే వాహనాలను నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద యూటర్న్ తీసుకొని భగాయత్ లేఅవుట్ మీదుగా బోడుప్పల్, ఫీర్జాదిగూడ వైపు వెళ్లాలి. తార్నాక నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలు హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్ వైపునకు మళ్లిస్తారు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.