Credits: Twitter

గత కొద్ది రోజుల నుంచి భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉండగా.. ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నట్లు తెలిపింది.

5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ, రైళ్ల కనెక్టివిటీ పూర్తి వివరాలు ఇవిగో..

మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, నంద్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు మంచి తేలికపాటి వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.