Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Amaravati, August 12: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో నాలుగు రోజులపాటు వర్షాలు (Rain Alert in AP) పడనున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ (Disaster Management Authority) తెలిపింది. ఈ నేపథ్యంలొ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

వచ్చే నాలుగు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం (Low pressure) ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు (k kanna babu) తెలిపారు. ఈ అల్ప పీడన ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కరోనాపై ఊరట..ఏపీలో లక్షా అరవై వేలకు పైగా డిశ్చార్జ్ కేసులు, తాజాగా 9,597 కేసులు నమోదు, రాష్ట్రంలో 2,54,146కు చేరిన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 

ఈ నాలుగు రోజులు తీరం ప్రాంతం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలున్నాయి.