Rainfall -Representational Image | (Photo-ANI)

ఎండల నుంచి ఉపశమనం కలిగించే వార్తను ఎఐండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా వచ్చేస్తున్నాయి. జూన్‌ 3న కేరళ తీరాన్ని తాకనున్నట్టు (Monsoon likely to hit Kerala by June 3) వాతావారణ శాఖ తెలిపింది. సాధారణంగా జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని చేరుకుంటాయి. అయితే ఈసారి మే 31న కేరళకు రుతుపవనాలు వస్తాయని వాతవరణ శాఖ (India Meteorological Department) మొదట అంచనా వేసింది. ప్రస్తుతం జూన్‌ 3న కేరళను తాకుతాయని చెబుతోంది. జూన్‌ మొదటి వారానికి కర్నాటక, గోవా తీరాలకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. రుతు పవనాల ఆగమనంతో కేరళ, మహరాష్ట్ర, కర్నాటకలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

గత వారం రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు భగ్గుమంటున్నాడు. మరో వారం పది రోజుల్లో రుతు పవనాలు తెలుగు రాష్ట్రాలకు చేరుకోనున్నాయి. దీంతో ఎండల తీవ్రత తగ్గనుంది. ఇటీవల వచ్చిన తౌక్టే, యాస్‌ తుపానుల కారణంగా రుతుపవనాల రాకలో ఏదైనా జాప్యం జరుగుతుందేమమో అనే ఆందోళన రైతుల్లో నెలకొని ఉండేది. కానీ రుతుపవనాలు సకాలంలో వస్తున్నట్టు వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతన్నలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.

రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు, పలు జిల్లాల్లో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం, ఈ సారి ముందే పలకరించిన నైరుతి రుతుపవనాలు

ఉపరితల ద్రోణి కారణంగా జూన్‌ రెండో తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం‌లోని పలు‌జి‌ల్లాల్లో వర్షాలు (More rain forecast in Telangana) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజులు ఉరు‌ములు, మెరు‌పులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీస్తూ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు (Heavy Rains To Telangana) కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో వైపు కేర‌ళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.