File image of heavy rains in Mumbai (Photo Credits: IANS)

Mumbai, July 15: కోవిడ్-19 తో విలవిలలాడుతున్న మ‌హారాష్ర్ట‌కు భారీ వర్షం రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. మహారాష్ట్రలోని ప‌లు ప్రాంతాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురువ‌నున్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ కేంద్రం(IMD) హెచ్చ‌రించింది. కొంక‌ణ్ తీరంతో పాటు ముంబై, థానేలో భారీ వ‌ర్షాలు (High Tide Alert Mumbai) కురుస్తాయ‌ని పేర్కొంది. కొంక‌ణ్ తీరాన్ని తీవ్ర‌మైన మేఘాలు క‌మ్ముకున్న‌ట్లు తెలిపింది. ముంబై, థానేలో 200 మీల్లీమీట‌ర్ల కంటే ఎక్కువ వ‌ర్ష‌పాతం న‌మోదు కానున్న‌ట్లు పేర్కొంది. 10 లక్షలకు చేరువలో కరోనా కేసులు, 24 గంటల్లో రికార్డు స్థాయిలో 29,429 కోవిడ్-19 పాజిటివ్‌ కేసులు నమోదు, ఇప్పటివరకు 5,92,032 మంది డిశ్చార్జ్

భారీ వ‌ర్ష సూచ‌న నేప‌థ్యంలో భారత వాతావరణ కేంద్రం మహారాష్ట్రలోని ముంబై, థానే, రాయ్‌గడ్, పాల్ఘర్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ముంబైలోని కొలాబా ప్రాంతంలో ఈ ఉదయం 25 మి.మీ వర్షం నమోదైంది. అదేవిధంగా పాల్ఘ‌ర్ లో సుమారు 124 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. మొత్తం మహారాష్ట్రలో 6 మిమీ నుండి 184 మిమీ వర్షపాతం ప్ర‌స్తుతానికి నమోదైంది.

Heavy Rains, High Tide in Mumbai Today, Says BMC:

నిరంతర వర్షాల కారణంగా లోత‌ట్టు ప్రాంతాలైన‌ హిందూమాత, సియోన్, గాంధీ మార్కెట్, దాదర్ టిటి, వడాలాలోని షక్కర్ పంచాయతీ చౌక్, ధారావిలోని ప‌లు ప్రాంతాలు, వడాలా ఫైర్ స్టేషన్, పరేల్ లోని ప‌లు ప్రాంతాలు, చెంబూర్, కుర్లా, అంధేరి సబ్వే వంటి ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి.