South Central Railway Update: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌, ఈ నెల 11 వరకు తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లు రద్దు, కారణం ఏంటంటే..
IRCTC (Photo-ANI)

రైలు ప్రయాణికులకు South Central Railway అలర్ట్‌ మెసేజ్ ఇచ్చింది. మౌలాలీ - సనత్‌నగర్‌ రైల్వే స్టేషన్ల మధ్య డబ్లింగ్‌, నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను ఈ నెల 11 వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా నడుపుతున్నారు.సికింద్రాబాద్‌(ప్రతీరోజు నడిచే) నుండి రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ వెళ్లే ప్రయాణికులకు పలు రైళ్లు రద్దయ్యాయి.

ఫిబ్రవరిలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు.. పూర్తి జాబితా ఇదిగో

హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఇంటర్‌ సిటీ(17011/12), కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ (12757/58), సికింద్రాబాద్‌-గుంటూరు ఇంటర్‌ సిటీ(12705/06) ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌- గుంటూరు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌(12714/13), కాకతీయ ఎక్స్‌ప్రెస్‌(17659/60) పూర్తిగా రద్దు చేశారు. భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌(17233/14)ను, సికింద్రాబాద్‌-గుంటూరు మధ్య నడిచే 17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట నుంచి బయలుదేరనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు రైళ్ల రద్దును గమనించాలని తెలిపారు.