Heatwave (Photo Credits: PTI)

Hyd, May 10: తెలంగాణలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ నుండి 43 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

మోచా తుపానుగా మారుతున్న తీవ్ర అల్పపీడనం, భారత్‌కు తప్పిన సైక్లోన్ గండం, వణుకుతున్న బంగ్లాదేశ్-మయన్మార్ తీరాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడింది. ఇది బుధవారం నాటికి అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనుంది. ఇది 11వ తేదీ వరకు ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తుంది.ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ మరింత బలపడి బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాల వైపు పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి వాయుగుండం ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఈ సాయంత్రానికి వాయుగుండంగా, రేపటికి తీవ్ర తుపానుగా మారుతుందని తెలిపిన ఐఎండీ

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం అన్నమయ్య జిల్లా సంబేపల్లి, సత్యసాయి జిల్లా నల్లమడ, మడకశిరలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని పేర్కొంది.

కాగా రాష్ట్రంలోని 28 మండలాల్లో బుధవారం వడగాడ్పులు వీచే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. ఆయా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.