Big alert for Tirumala devotess, who is going to Tirumala!(X)

తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను ప్రకటించింది. ప్రతి ఏడాదిలా ఈసారి కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాలను భక్తులకు కల్పించనున్నట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. ఈ సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మొత్తం పది రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వారం తెరవబడనుంది. ఈ కాలంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి దివ్యదర్శనం కోసం తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

టీటీడీ ఈవో తాజా వివరాల ప్రకారం.. ఈసారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొత్తం 182 గంటల సమయం కేటాయించబడింది. ఇందులో ముఖ్యంగా సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకున్నట్లు చెప్పారు. మొత్తం సమయం నుండి 164 గంటలను సాధారణ భక్తులకే ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరాల్లో అనేకసార్లు VIP లు, ప్రత్యేక టికెట్లు, ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులకు ఎక్కువ సమయం దొరకకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈసారైనా అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం, ఏపీకి మరోసారి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. ఈసారి భక్తులకు ఇబ్బందులు లేకుండా, ముఖ్యంగా సాధారణ ప్రజలకు దర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యమని టీటీడీ ఈవో పేర్కొన్నారు. గతంలో వచ్చిన అనుభవాలను పరిగణలోకి తీసుకొని, ఈసారి ఆన్‌లైన్ బుకింగ్, టోకెన్ వ్యవస్థ, క్యూ లైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, తాగునీరు, లడ్డూ ప్రసాదం పంపిణీ వంటి అంశాల్లో మరింత పటిష్టత కల్పిస్తున్నట్లు తెలిపారు.

వైకుంఠ ఏకాదశి రోజున పరమపద వాకిలి ద్వారా స్వామివారిని దర్శించడం ఎంతో శుభకరమని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతీ సంవత్సరమూ భారీగా భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఈ భారీ జనసంద్రాన్ని సమర్థవంతంగా నియంత్రించడానికి ప్రత్యేక బ్లూల్ ప్రింట్ సిద్ధం చేసినట్లు టీటీడీ బోర్డు వెల్లడించింది. భక్తుల కోసం అదనపు పార్కింగ్ సౌకర్యాలు, రవాణా నిర్వహణ, తిరుపతి నుంచి తిరుమల ఘాట్ రోడ్లపై ప్రత్యేక పర్యవేక్షణ వంటి ఏర్పాట్లు చేపట్టనున్నారు.అదనంగా, మొదటి మూడు రోజుల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300), శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇది పూర్తిగా సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించడానికే కావని ఈవో స్పష్టం చేశారు.