Vijayawada, June 26: ఏపీలో (AP) పాఠశాలలు (Schools) సోమవారం నుంచి రెండు పూటలూ నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 'రాష్ట్రంలో జూన్ 12 నుంచి 24వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ చేసిన హెచ్చరిక మేరకు ఒంటి పూట తరగతులను నిర్వహించాలని ఆదేశించాం. వాతావరణం సాధారణ స్థాయికి రావడంతో రెండు పూటలా తరగతులు నిర్వహించేలా ప్రభుత్వ (Govt.), ప్రైవేటు (Private), ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం' అని ఆయన పేర్కొన్నారు.
పుస్తకాల పంపిణీ
పాఠశాలలు పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ స్కూల్స్ లోని విద్యార్థులకు అవసరమైన పుస్తకాలను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.