RailTel to continue free WiFi service at railway stations after Google will stop Project Station(Photo-ANI)

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ మీదుగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06549) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 5న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06550) ఈ నెల 6న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది.

ప్రయాణికులకు అలర్ట్, 240 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వే, రద్దయిన రైళ్ల పూర్తి సమాచారం ఇదిగో, జాబితాలో మీ రైలు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి

- అలాగే, సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–నర్సాపూర్‌ (06521)రైలు ఈ నెల 3న ఉదయం 11.20 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06522) ఈ నెల 4న మధ్యాహ్నం 3.40 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు చేరుకుంటుంది.

- సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు–కాచిగూడ(06523) ఈ నెల 3, 5 తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరు స్టేషన్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06524) ఈ నెల 4, 6 తేదీల్లో రాత్రి 10.55 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సర్‌ విశ్వేశ్వరయ్య టెర్మినల్‌ బెంగళూరుకు చేరుకుంటుంది