Hyderabad, Nov 11: హైదరాబాద్ (Hyderabad) లోని పలు ప్రాంతాల్లో నేడు అంటే సోమవారం తాగు నీటి సరఫరాకు (Water Supply) అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి అధికారులు ప్రకటించారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా ఉండబోదని అధికారులు వెల్లడించారు. నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేస్- 2లో కలబ్ గూర్ నుంచి పటాన్ చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీలు ఏర్పడింది. ఈ నేపథ్యంలో మరమ్మతుల కారణంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నట్టు పేర్కొన్నారు. ముందస్తు సమాచారం మేరకు ప్రజలు తాత్కాలిక ప్రత్యామ్నాయాలను చేసుకోవాలని, ట్యాంకర్లలో నీటి లభ్యత అందుబాటులో ఉన్నదని వివరించారు. స్థానికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రాంతాలపై ప్రభావం
ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, ఎర్రగడ్డ, కెపీహెచ్ బీ, మూసాపేట, చందానగర్, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు తెలిపారు.