ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల (ఆగస్టు) 5వ తేదీన శుక్రవారం విస్తారంగా వానలు పడతాయని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ (Amaravati Meteorological dept) ప్రకటించింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rains in AP) పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూల్, నంద్యాల, అనంతపూర్, శ్రీసత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని ప్రకటించింది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోత వర్షం పడొచ్చని పేర్కొంది.
వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది.ఈ మేరకు వివరాలను ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ గురువారం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఏయే ప్రాంతాల్లో ఎంతెంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనే వివరాలతో కూడిన మ్యాప్ ను కూడా జత చేసింది.
ఏపీ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణస్వీకారం, కొత్త న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్
నెల్లూరులో ఇవాళ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మాగుంట లేఅవుట్ వద్ద అండర్ బ్రిడ్జిలో మోకాలి లోతు నీరు నిలిచింది. అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు అటుగా వెళుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి రోడ్డుపైకి భారీగా నీరు చేరడంతో ఆగిపోయారు. అయితే, ఇద్దరు వాహనదారులు నీటిని కూడా లెక్కచేయకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కొంచెం దూరం వెళ్లాక నీరు ఎక్కువగా ఉండడంతో ఆ వాహనాలు నిలిచిపోయాయి.
ఎవరూ స్పందించకపోగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం వెంటనే రంగంలోకి దిగారు. ఓవైపు వర్షం పడుతున్నా, తన అనుచరులతో కలిసి నీటిలో దిగి ఆ వాహనాలను ముందుకు నెట్టారు. ఎమ్మెల్యే ఆ కార్లను నెట్టడం చూసి, అక్కడున్న ఇతరులు కూడా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి మాగుంట లేఅవుట్ వద్ద అండర్ బ్రిడ్జి వద్ద నీరు నిలిచిన విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. వెంటనే మోటార్లతో నీటిని తోడివేయాలని స్పష్టం చేశారు