Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Amaravati, Feb 21: తూర్పు గాలుల కారణంగా బంగాళాఖాతంపై ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీనికితోడు పశ్చిమ ప్రాంతాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా మరో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ ద్రోణి తెలుగు రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలపై (Rain Alert for 7 States) వ్యాపించడంతో ఆకాశం మేఘాలతో నిండిపోయి మబ్బులు ముసురుపట్టాయి. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు, అంచనా వేశారు.

ఈ ద్రోణి ప్రస్తుతం తమిళనాడు తీరం నుంచి ఒడిశా తీరం వరకూ వ్యాపించిందని, రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లోనూ రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా, నిన్న ఆకాశం పూర్తి మేఘావృతమై కనిపించగా, కొన్ని చోట్ల వర్షం పడింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. ఈ అకాల వర్షాలకు మామిడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాల వర్షాలతో చేతికందిన పంట నోటికందే పరిస్థితి లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోలు ధరలు పెరిగితే మంచిదే, పైగా జనాలు అలవాటు పడతారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ బీజేపీ మంత్రి నారాయణ్ ప్రసాద్, మండిపడుతున్న ప్రతిపక్షాలు

మరోవైపు వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే నాలుగు నుంచి 5 డిగ్రీలు పడిపోయాయి. పగటి పూట కాసేపు ఎండగా అనిపించినా, రాత్రి వచ్చేసరికి తీవ్రమైన చలి వాతావరణం కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్ నగరంలో 18 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, మరో మూడు రోజులు ఇదే విధమైన వాతావరణం ఉంటుందని, ఆపై క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.