Amaravati, Oct 26: ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం (Surface periodicity) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇది రానున్న 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరణ స్ధిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా రాగల 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Moderate rains for next two days ) కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
బుధవారం దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, సోమవారం భారత ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలోకి ఈశాన్య రుతు పవనాల రాక ప్రారంభమైంది. మరోవైపు అధిక పీడనం కారణంగా సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. దక్షిణ కొస్తాలోని ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూలులో అక్కడక్కడా భారీ వర్షాలు కురియనున్నాయని పేర్కొన్నారు. కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రాగల రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
అదేవిధంగా ఈనెల 26న ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రం లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో రాగల రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అధిక పీడనం వల్ల సముద్రం నుంచి రాష్ట్రం వైపు తేమ వస్తోంది. దాంతో అనంతపురం చిత్తూరు తో పాటు పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.