Weather Update: వచ్చే నాలుగు రోజులు తీవ్ర చలిగాలులు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన ఐఎండీ, దేశ రాజధానిలో ఇంకా దట్టంగా కురవనున్న పొగమంచు
Cold wave conditions to intensify in North India (Photo Credits: PTI)

New Delhi, Jan 27: దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు తీవ్ర చలిగాలులు (Cold Wave Conditions) వీస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. రానున్న 3-4 రోజుల పాటు ఢిల్లీ, వాయువ్య, మధ్య భారతదేశంలో చలిగాలులు (Cold Wave Conditions Likely To Persist In North India) తీవ్రమవుతాయని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. జనవరి 26వతేదీ తర్వాత ఢిల్లీలో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ సీనియర్ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి అంచనా వేశారు. ఫిబ్రవరి 2 వతేదీ వరకు ఢిల్లీ, పంజాబ్, హర్యానాలలో వర్షాలు కురిసే అవకాశం లేదని ఆర్కే జెనామణి తెలిపారు.

పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 15-17 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో చలిగాలులు తీవ్రమవుతాయని జెనామణి పేర్కొన్నారు. ఇక మధ్యప్రదేశ్‌తో సహా వాయువ్య, మధ్య భారతదేశం రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో చలి తీవ్రత పెరుగుతోందని ఐఎండీ తన వెదర్ బులెటిన్‌లో తెలిపింది. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఢిల్లీలోని అన్ని వాతావరణ కేంద్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10 డిగ్రీల నుంచి 11 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి.వాయువ్య భారతదేశంలో వచ్చే ఐదు రోజుల్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లలో కొన్ని ప్రాంతాల్లో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారత్‌ లో కరోనా కేసులు రివర్స్, పాజిటివ్ కేసులతో పోలిస్తే పెరుగుతున్న రికవరీలు, పలు రాష్ట్రాల్లో తగ్గుతున్న కేసుల సంఖ్య

పంజాబ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, అస్సాం, సిక్కిం, మేఘాలయ, త్రిపురలలో వచ్చే రెండు మూడు రోజులలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మైదాన ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గితే చలిగాలులు వీస్తాయని ఐఎండీ ప్రకటించింది.జార్ఖండ్, పశ్చిమ బెంగాల్,ఒడిశాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.జార్ఖండ్, గంగానది పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో అండమాన్, నికోబార్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.