Moderate Rains: రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ద్రోణి, బలహీన పడిన ఉపరితల ఆవర్తనం, హైదరాబాద్‌లో భానుడి భగభగలు
Heavy Rainfall In Hyderabad GHMC Warning | Photo - PTI

Hyderabad, April 28: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. దానికి తోడు కరోనాతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడం వల్ల రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు (Andhra Prades Moderate Rains) కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో ద్రోణి కొనసాగుతోంది. ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్‌ అండ్‌ సిక్కిం నుంచి, దక్షిణ ఒడిశా తీర ప్రాంతం వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 2.1 కిలోమీటర్లు ఎత్తున ఉంది.

నైరుతి బంగాళాఖాతం దగ్గర ఉన్న ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. సముద్ర మట్టానికి 2.1 కిలో మీటర్లు నుంచి 3.6 కిలోమీటర్ల మధ్య ఉంది. ఉపరితల ఆవర్తనం బలహీన పడిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, మంగళవారం విశాఖలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.

ఇక గ్రేటర్‌లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు ఎండతీవ్రతకు అల్లాడుతున్నారు. నగరంలో ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు రోజుకు సగటున 38 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అయితే తర్వాత వారం రోజులపాటు ఎండలు తగ్గాయి. మళ్లీ ఆరు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం నారాయణగూడలో 40.0, మల్కాజిగిరిలో 39.9, ఖైరతాబాద్‌లో 39.8, బాలానగర్‌, చార్మినార్‌లో 39.6, ఉప్పల్‌, నాంపల్లిలో 39.5, తిరుమలగిరి, శేరిలింగంపల్లిలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, సాయంత్రం మాత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది.

జాగ్రత్తగా ఉండండి..ఒక్కడి నుంచి 406 మందికి కరోనా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించకుంటే జరిగేది అదే, కరోనాను నిరోధించేందుకు నిబంధనలు పాటించాలని కోరిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురు వారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Telangana Moderate Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నైరుతి, ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం ఉత్తర కర్ణాటక నుంచి కేరళ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తువరకు కొనసాగుతున్నట్లు తెలిపింది.