Polling Update: రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయమంటున్న ప్రధాని మోడీ, సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం
maharashtra-haryana-assembly-elections-2019-polling-update (Photo-PTI)

Mumbai, October 21: మినీ ఎన్నికల సమరం ప్రారంభం అయింది. మహారాష్ట్ర, హర్యానాలోలోని అసెంబ్లీ స్థానాలకు, ఇతర రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ప్రధానంగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలోని 90 స్థానాల పైనే అందరి చూపు ఉంది. ఈ ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హర్యానాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్రలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ పార్టీ ఈ సారి ఎలాగైనా అధికారం మాదే అనే ధీమాతో ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు కూడా నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.  పోలింగ్ బూత్‌ల దగ్గర 144 సెక్షన్

రికార్డు స్థాయి పోలింగ్ నమోదు చేయండి: ప్రధాని మోడీ

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు జరుగుతున్న పోలింగ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు చేసి ప్రజాస్వామ్య పండగను సుసంపన్నం చేయాలని అన్నారు. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొంటుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

ప్రధాని మోడీ ట్వీట్

ఓటు హక్కును వినియోగించుకున్న అజిత్ పవార్

రామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున అజిత్‌ పవార్‌ పోటీ చేస్తున్నారు. ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాలని అజిత్‌ భావిస్తున్నారు. ప్రముఖ నటి శుభ ఖోటే అంధేరి పశ్చిమ నియోజకర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించుకున్న శరద్ పవార్

ఓటు హక్కును వినియోగించుకున్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ నాగ్‌పూర్‌లోని మహాల్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు

ట్రాక్టర్ లో ఓటింగ్ వేయడానికి వెళుతున్న జననాయక్ జనతాపార్టీ లీడర్

కాగా హర్యానా ఎన్నికల్లో పోటీ చేస్తున్న జననాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా తన ఫ్యామిలీతో కలిసి ఓటు వేయడానికి ట్రాక్టర్ లో వెళ్లారు. సిర్సాలో ఈయనకు ఓటు ఉంది.