Tirupati Laddu (photo-X)

Newdelhi, Sep 27: తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ (Laddu) వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామ మందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాల రాముడికి బయటి సంస్థలు తయారుచేసిన ప్రసాదాలను నైవేద్యం పెట్టడంపై నిషేధం విధించారు. ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదాలనే స్వామికి నైవేద్యం పెట్టాలని, భక్తులకు ప్రసాదంగా అందించాలని నిర్ణయించినట్లు ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

నేడు తిరుమలకు జగన్‌.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు

అందుకేనా?

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో తిరుమల లడ్డూలను పంపిణీ చేయడం తెలిసిందే. అయితే, తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, మాంసం కలిసిందన్న ఆరోపణలు అందర్నీ నిశ్చేష్టులను చేశాయి. ఈ క్రమంలోనే అయోధ్య రామ మందిరం నిర్వాహకులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.

బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్‌ 3న ఘట స్థాపనతో ఉత్సవాలు షురూ.. అమ్మవారు ఏ రోజున ఎలా దర్శనం ఇస్తారంటే?