Bihar: ప్రసాదం తీసుకున్న 120 మందికి తీవ్ర అస్వస్థత, క‌డుపు నొప్పి, వాంతులు, విరోచ‌నాల‌తో ఆస్పత్రికి పరుగులు, బీహార్‌లోని వైశాలి జిల్లాలో విషాదకర ఘటన
Prasad (Photo Credits: Twitter| Representational Image)

Patna, June 13: బీహార్‌లోని వైశాలి జిల్లాలో (Bihar’s Vaishali) విషాదకర ఘటన చోటు చేసుకుంది. సత్య నారాయణన్ పూజలో ప్రసాదం సేవించిన 120 మంది వ్యక్తులు అస్వస్థతకు (120 ill after consuming prasad) గురయ్యారు. స‌త్య‌నారాయ‌ణ పూజ‌లో ఇచ్చిన ప్ర‌సాదం స్వీక‌రించిన‌వాళ్లు క‌డుపు నొప్పి, వాంతులు, విరోచ‌నాల‌తో ఇబ్బందిప‌డ్డారు.పాతేపూర్ బ్లాక్‌లో ఉన్న మ‌హ‌తి ధ‌ర్మ‌చంద్ పంచాయ‌త్ వార్డు నెంబ‌ర్ 10లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వైశాలి సివిల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అమితాబ్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. వార్డు నెంబ‌ర్ 10లో ఆహారం క‌లుషిత‌మైంద‌ని, వాళ్ల‌కు ఓఆర్ఎస్ ప్యాకెట్ల‌ను ఇచ్చామ‌ని, అవ‌స‌ర‌మైన మందుల్ని స‌ర‌ఫ‌రా చేశామ‌ని, అయిదుగురు బాధితుల ఆరోగ్యం క్షీణించింద‌ని, వాళ్ల‌ను ప‌తేపూర్ హెల్త్ సెంట‌ర్‌కు తీసుకువెళ్లిన‌ట్లు తెలిపారు. దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, 50 వేలకు చేరువైన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 8,084 మందికి కరోనా, అత్యధికంగా కేరళలో 4319,మహారాష్ట్రలో 2946 కేసులు నమోదు

ప్ర‌సాదం కోసం వినియోగించిన అర‌టి పండ్ల‌లో అధిక స్థాయిలో కెమిక‌ల్ వాడిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. అర‌డి పండ్ల‌ను ఉడ‌క‌బెట్ట‌డం వ‌ల్ల కూడా ప్ర‌సాదం క‌లుషిత‌మైన‌ట్లు గుర్తించామ‌ని పోలీసులు తెలిపారు.వైశాలి సివిల్‌ సర్జన్‌ డాక్టర్‌ అమితాబ్‌ కుమార్‌ సిన్హా మాట్లాడుతూ.. ఘటన గురించి తెలిసిన వెంటనే వైద్య బృందాన్ని వార్డు నంబర్‌ 10కి పంపించాం. ఫుడ్‌ పాయిజనింగ్‌కు గురైన వారు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతర అవసరమైన మందులను పంపిణీ చేశాం. బాధితుల్లో ఐదుగురు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని పటేపూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రికి తరలించారు.