46 kg Cannabis Worth Rs 20 lakh Seized In Visakhapatnam (Photo-ANI)

Visakhapatnam, November 8: విశాఖపట్నం (Visakhapatnam) జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద శుక్రవారం 46 కేజీల గంజాయి(Cannabis)ని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. అక్కడి పోలీసులు కథనం ప్రకారం... చింతపల్లి ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వారు తాళ్లపాలెం జంక్షన్‌ వద్ద తనిఖీలు చేపట్టారు. నర్సీపట్నం(Narsipatnam) వైపు నుంచి వస్తున్న టాటా మ్యాజిక్‌ వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 46 కిలోల గంజాయి పట్టుబడింది.

గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గంజాయిని వైజాగ్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

గంజాయి మూలంగా ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా దీనిపై ఉక్కుపాదం మోపాయి అయినప్పటికి గంజాయి తాలూకా మూలాలు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి.

అదుపులో గంజాయి స్మగ్లర్లు

ఈ నేపథ్యంలోనే గంజాయి స్మగ్లింగ్ పై ఎక్సైజ్ విభాగం తనిఖీలు నిర్వహిస్తుండగా మరోచోట అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన ముగ్గురు పోలీసులకు చిక్కారు. ఈ ముఠాలో ముగ్గురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని, చదువు నెపంతో వీరు విశాఖలో అద్దెకు రూమ్‌లను తీసుకుని ఎందరో యువతీ, యువకులను ఇందులోకి లాగి వ్యాపారం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.