వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి పలు జూలలో 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతిచెందినట్లు అక్కడి అధికారిక మీడియా వెల్లడించింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్టు వియత్నాం న్యూస్ ఏజెన్సీ (VNA) పేర్కొంది.లాంగ్ యాన్ ప్రావిన్స్‌లోని ప్రైవేట్ మై క్విన్ సఫారీ పార్క్, హోచి మిన్ సిటీకి సమీపంలోని డాంగ్ నైలోని వూన్ జోయ్ జూలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరో వైరస్ వచ్చేసింది, జర్మనీలో ప్రాణాంతక మార్బర్గ్ వైరస్ వెలుగులోకి, దీని లక్షణాలు ఎంత డేంజర్ అంటే..
వీటి శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్‌కు పంపగా.. హెచ్5ఎన్1 టైప్ ఎ రకం వల్లే చనిపోయాయని తేలింది. 2004లో కూడా బర్డ్‌ఫ్లూ కారణంగా థాయిలాండ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రీడింగ్ ఫార్మ్‌లో డజన్లకొద్దీ పులులు మృత్యువాతపడ్డాయి. క్షీరదాల్లో ప్రాణాంతక హెచ్5ఎన్1తో పాటు పలు ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కేసులు 2022 నుంచి పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.