Happy Birthday Google (Photo Credits File Image)

Hyd, Sep 27: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ 26వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ 26 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు చేసుకుంటూ విలువైన సమాచారాన్ని అందరికి చేరవేసింది. ఈ నేపథ్యంలో అసలు ఈ సెర్చ్ దిగ్గజం జర్నీ ఎక్కడ మొదలైంది,ఎలా క్రమక్రమంగా విస్తరించింది అనే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

వాస్తవానికి 1998, సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని స్థాపించారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదివే సెర్గీ బ్రిన్ , లారీ పేజ్ అనే అమెరికన్ సైంటిస్టులు గూగుల్‌ను స్థాపించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ శివారులోని గ్యారేజీలోనే గూగుల్ మొదటి ఆఫీసుగా మారింది. కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో గూగుల్‌ప్లెక్స్ గా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత ప్రధాన కార్యాలయానికి మారింది.

ప్రపంచవ్యాప్తంగా 150 కంటే ఎక్కువ భాషలలో గూగుల్ బిలియన్ల కొద్దీ శోధనలు జరుగుతున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 24/7 అందరికి అందుబాటులో ఉంది. ఎలాంటి సమాచారాన్ని అయినా సెకన్లలో అందిస్తుంది గూగుల్. ప్రాంతాల విశిష్టత, దాని చరిత్ర, ప్రముఖుల పుట్టినరోజు,చనిపోయిన రోజు, యుద్దాలు,ఆరోగ్యం ఇలా వివిధ రంగాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్ నివేదిక ప్రకారం.. సెర్గీ బ్రిన్, లారీ పేజ్ మధ్య మొదటి సమావేశంతో గూగుల్ ప్రారంభానికి పునాది ఏర్పడింది.  ఆపిల్ కంపెనీలో భారీగా ఉద్యోగాలు, వచ్చే ఏడాది నాటికి ఆరు లక్షల ఉద్యోగాలు సృష్టించనున్నట్లుగా వార్తలు

తొలుత బ్యాక్‌రబ్ అనే పేరు పెట్టగా ఆ తర్వాత గూగుల్‌గా మార్చారు. గూగుల్ పేరు ప్రారంభంలో గూగోల్ (Googol)గా ఉండగా Googol అంటే 1 తర్వాత 100 జీరోలు అనమాట. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆఫీసుల్లో కలర్‌ఫుల్ వాతావరణం ఉంటుంది. ఫిబ్రవరి 25, 2009న, గూగుల్ తన మొదటి ట్వీట్‌ను పంపింది. అది బైనరీ కోడ్‌లో రాసి ఉండగా దానిని ఆంగ్లంలోకి ట్రాన్సులేట్ చేస్తే ‘నేను అదృష్టవంతుడిని’ అనే మెసేజ్ అందించింది.