Gautam Adani (File Image)

అదానీ గ్రూప్- హిండెన్‌బర్గ్‌ వివాదం దేశంలో ప్రకంపనలు రేకెత్తిస్తున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2024నాటికి చెల్లించాల్సిన ప్లెడ్జ్‌ షేర్ల రిలీజ్‌ కోసం భారీ మొత్తాన్ని ఆదాని కంపెనీ (Adani Group Companies Promoters) ముందుగానే చెల్లించనుంది. ఇందులో భాగంగా 1.1 బిలియన్‌ డాలర్లను చెల్లించనుంది. ఈమేరకు అదాని కంపెనీ ఒక ప్రకటన జారీ చేసింది.

ఇటీవలి మార్కెట్ అస్థిరత దృష్ట్యా, అదానీ లిస్టెడ్ కంపెనీల షేర్ల మద్దతుతో మొత్తం ప్రమోటర్ పరపతిని తగ్గించడానికి ప్రమోటర్ల నిబద్ధత కొనసాగింపులో, మెచ్యూరిటీ కంటే ముందే అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్‌మిషన్‌లలో తాకట్టు పెట్టిన 1,114 మిలియన డాలర్ల ప్రీ-పే మొత్తాలను ($1.1 Billion To Release) చెల్లించనున్నామని ఆ ప్రకటనలో ప్రకటించింది.

తెలుగు రాష్ట్రాల్లో అదాని ప్రకంపనలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు నిరసనకు దిగన తెలంగాణ కాంగ్రెస్ నేతలు

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2024 చెల్లించాల్సి ఉండగా ముందుగానే $1.114 బిలియన్ల షేర్-బ్యాక్డ్ మొత్తాలను ముంద్తస్తుగానే కంపెనీ చెల్లించనుంది. ఇందులో భాగంగా అదానీ పోర్ట్స్‌లో ప్రమోటర్ల హోల్డింగ్‌లో సుమారు 168 మిలియన్ షేర్లు (12 శాతం వాటా), 27.56 మిలియన్ షేర్లు (3 శాతం వాటా) అదానీ గ్రీన్ ఎనర్జీ మరియు అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 11.77 మిలియన్ షేర్లు (1.4 శాతం వాటా) విడుదల కానున్నాయి.

కుప్పకూలిపోతున్న అదానీ సామ్రాజ్యం, కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన LIC, భారీ నష్టాలపై స్పందించిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్

అదానీ గ్రీన్ స్క్రిప్ వరుగా నాలుగో సెషన్లోనూ సోమవారం నాడు 5శాతం పడి లోయర్ సర్క్యూట్ అయింది. గత నెలతో పోలిస్తే సగానికి పైగా కోల్పోయింది. అదానీ గ్రూపు గత కొన్ని దశాబ్దాలుగా స్టాక్ మానిప్యులేషన్‌, అకౌంటింగ్ మోసాలు పాల్పడిందనే ఆరోపణలతో ఆమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు మార్కెట్లో ప్రకంపనలు రేపింది. దాదాపు 10 లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీలు భారీ నష్టాన్ని చవిచూశాయి.

ఒక్క రోజులో రూ.48.600 కోట్ల మేర తుడిచి పెట్టుకు పోయిన గౌతం అదానీ ఆస్తులు, నంబర్ వన్ నుంచి ఏడవ స్థానానికి పడిపోయిన బిలియనీర్

అయితే అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ వాదనలను నిరాధారమైనదని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.