New Delhi, October 15: ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ క్యాంపస్‌లో పుట్టినరోజు వేడుకలో తన సీనియర్ సహోద్యోగి ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కేసు నమోదు (AIIMS Delhi Doctor Booked for Raping Colleague) చేసినట్లు అధికారులు తెలిపారు.
వివాహితుడైన నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు తెలిపారు.ఈ సంఘటన సెప్టెంబర్ 26 న ఆమె సహోద్యోగి పుట్టినరోజు వేడుకలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 11 న హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందిందని, MLC (మెడికో లీగల్ కేసు) కూడా జరిగిందని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఎయిమ్స్‌లో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు తన సహచరుల్లో ఒకరి పుట్టినరోజు వేడుకలకు మరో సీనియర్ డాక్టర్ ఆహ్వానించాడు. అక్కడ కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపిన ద్రవాన్ని ఆమెకు ఇచ్చాడు. అది తాగగానే ఆమె మత్తులోకి జారుకుంది. అనంతరం ఆమెపై సీనియర్ వైద్యుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు మెలకువ రాగా జరిగిన విషయం ‘ఎవరికైనా చెప్తే చంపేస్తానని వైద్యుడు బాధితురాలిని బెదిరించాడు.
చివరకు ఐదు రోజుల తర్వాత ధైర్యం చేసిన ఆమె.. హౌజ్ ఖాస్ పోలీసులను సంప్రదించి తనపై లైంగికదాడికి పాల్పడిన వైద్యుడిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్ సిద్ధం చేశారు. కాగా, నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.
మేజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హౌజ్ ఖాస్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 377 కింద కేసు నమోదైనట్లు దక్షిణ జిల్లా డీసీపీ బెనిటా మేరీ జాకర్ తెలిపారు. నిందితుడు ఇక్కడ ఎయిమ్స్ కాంప్లెక్స్‌లోని నివాస సముదాయంలో నివసిస్తున్నాడు. సంఘటన జరిగిన రాత్రి, నిందితుడి కుటుంబం పట్టణం వెలుపల ఉందని, పుట్టినరోజు పార్టీకి హాజరైన ఇతర వైద్యులను కూడా ప్రశ్నిస్తామని పోలీసులు తెలిపారు.